Telugu Gateway
Top Stories

బట్టతలదాచి పెళ్లి..కేసు పెట్టిన భార్య

బట్టతలదాచి పెళ్లి..కేసు పెట్టిన భార్య
X

ఆమె 27 సంవత్సరాల చార్టెడ్ అకౌంటెంట్. ముంబయ్ కు చెందిన 29 సంవత్సరాల వ్యక్తిని పెళ్లాడింది. ఈ పెళ్లి సెప్టెంబర్ నెలలో జరిగింది. అయితే పెళ్ళి కొడుకుకి బట్ట తల ఉంది. ఈ విషయాన్ని 'విగ్'తో కవర్ చేశాడు పెళ్ళికొడుకు. తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 27 సంవత్సరాల యువతి చీటింగ్ కేసు పెట్టింది. ఈ విషయాన్ని నయా నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సీనియర్ ఇన్ స్పెక్టర్ కైలాష్ బర్వే తెలిపారు. అత్త, మామలు కూడా తన భర్తకు బట్ట తల ఉన్న విషయం చెప్పకుండా మోసం చేశారని ఆమె ఆరోపిస్తోంది. అంతే కాదు..బట్ట తల విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని కేసు పెట్టింది.

ఫోన్ ను హ్యాక్ చేసి తన ఛాటింగ్ వివరాలతోపాటు కాల్ డేటాను కూడా పరిశీలించారని, అసహజ శృంగార కార్యక్రమాల కోసం ఒత్తి డి చేసినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతగాడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇతర నిందితులకు థాణే కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రధాన నిందితుడుకి మాత్రం బెయిల్ నిరాకరించారు. పోలీసుల ముందు సరెండర్ కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

Next Story
Share it