Telugu Gateway
Top Stories

లాయర్ దగ్గర 217 కోట్ల రూపాయలు

లాయర్ దగ్గర 217 కోట్ల రూపాయలు
X

ఆయనో ఆర్బిట్రేషన్ లాయర్. ఒక క్లయింట్ దగ్గర నుంచి 117 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మరో క్లయింట్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. వీరిద్దరి వివాదాలు పరిష్కరించటం కోసం ఆయన మొత్తం వసూలు చేశారు. ఖాతాల్లోకి రాని ఈ నగదుతో రెసిడెన్షియల్ తోపాటు వాణిజ్య భవనాలు, పలు స్కూళ్ళు కొనుగోలు చేశారు.అంతే కాదు ఆయన దగ్గర నుంచి 5.5 కోట్ల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐటి శాఖ అధికారులు ఢిల్లీ తోపా హర్యానాల్లో మొత్తం 38 ప్రదేశాల్లో తనిఖీ చేపట్టారు. మనోజ్ కుమార్ సింగ్ అనే అడ్వకేట్ ఈ డబ్బు తీసుకున్నట్లు ఐటి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సదరు అడ్వకేట్ వాణిజ్య మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారంలో నిపుణుడిగా తెలిపారు.

ఖాతాల్లో లేని నగదు లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా ఈ తనిఖీల్లో ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పది లాకర్లను కూడా ఐటి అధికారులు గుర్తించారు. 117 కోట్ల రూపాయలను ఓ క్లయింట్ దగ్గర నుంచి తీసుకుని రికార్డుల్లో మాత్రం కేవలం 21 కోట్ల రూపాయలను మాత్రమే చూపించారు. ఈ మొత్తం మాత్రం చెక్ ద్వారానే పొందారు. మరో మౌలికసదుపాయాల కంపెనీ నుంచి మాత్రం 100 కోట్ల రూపాయలను నగదు రూపంలో పొందారు. ప్రభుత్వ రంగ కంపెనీతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ మొత్తం తీసుకున్నారు. గత రెండేళ్ల కాలంలో పలు ఖరీదైన ప్రాంతాల్లో ఈ అడ్వకేట్ పలు నివాసాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ చెల్లింపులు అన్నీ నగదు రూపంలోనే చేశారు.

Next Story
Share it