ఫస్ట్ టైం 2000 రూపాయలు దాటిన షేర్లు

స్టాక్ మార్కెట్ లో ప్రముఖ ఫార్మా కంపెనీ లారస్ లాబ్స్ షేర్లు మరో రికార్డు నమోదు చేశాయి. గత కొన్ని కొన్ని నెలలుగా ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చిన ఈ కంపెనీ సోమవారం నాడు మరో కొత్త మైలు రాయిని అందుకుంది. ఫస్ట్ టైం లారస్ షేర్లు 2000 రూపాయలను అధిగమించింది. బిఎస్ ఈ లో ఈ షేర్ ధర 52 వారాల రికార్డు ధర 2023 రూపాయలకు చేరింది. తర్వాత లాభాల స్వీకరణతో ఫైనల్ గా 63 రూపాయల లాభంతో 2018 రూపాయల వద్ద ముగిసింది. ఈ షేర్ లో గత కొంత కాలంగా విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) తమ వాటా పెంచుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.



