Telugu Gateway
Top Stories

హెచ్ డీబి ఫైనాన్సియల్..లిస్టింగ్ రోజే మంచి లాభాలు

హెచ్ డీబి ఫైనాన్సియల్..లిస్టింగ్ రోజే మంచి లాభాలు
X

స్టాక్ మార్కెట్ బుధవారం నాడు స్తబ్దుగా ఉన్నా కూడా ఇటీవల ఐపీఓకి వచ్చిన హెచ్ బిడీ ఫైనాన్సియల్స్ సర్వీసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లోనే అదరగొట్టింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ 12500 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇన్వెస్టర్ల నుంచి ఈ ఇష్యూ కి మంచి స్పందనే దక్కింది. బుధవారం నాడు ఈ కంపెనీ షేర్లు బిఎస్ఈ తో పాటు ఎన్ఎస్ఈ లో కూడా లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చింది అనే చెప్పాలి.

కంపెనీ ఐపీఓ లో ఒక్కో షేర్ ను 740 రూపాయల గరిష్ట ధర వద్ద జారీ చేయగా ..లిస్టింగ్ రోజే ప్రారంభంలో ఈ షేర్లు ఏకంగా వంద రూపాయల లాభంతో 840 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ తో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజషన్ దగ్గర దగ్గర డెబ్భై వేల కోట్ల రూపాయలుగా ఉంది. లిస్టింగ్ రోజే ఈ షేర్ కు సంబంధించి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎం కె గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. 2026 జూన్ నాటికీ ఈ షేర్లు 900 రూపాయలకు చేరతాయని అంచనా వేసింది.

Next Story
Share it