Telugu Gateway
Top Stories

మూడు నెలల్లో 5.3 కోట్ల స్మార్ట్ ఫోన్లు కొన్నారు

మూడు నెలల్లో 5.3 కోట్ల స్మార్ట్ ఫోన్లు కొన్నారు
X

దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ దూసుకెళుతోంది. 2020 జులై-సెప్టెంబర్ కాలంలో ఏకంగా 5.3 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలం కంటే ఈ సారి అమ్మకాలు తొమ్మిది శాతం పెరిగాయి. ఈ విషయాన్ని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ వెల్లడించింది. 24 శాతం వాటాతో శాంసంగ్ మార్కెట్ లీడర్ గా ఉందని తెలిపారు. 23 శాతం వాటాతో జియోమి రెండవ స్థానంలో ఉండగా, వివో 16 శాతం మార్కెట్ వాటా ఉంది.

పండగల సీజన్ ఈ అమ్మకాలు పెరగటానికి కూడా కారణం అయి ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం చూస్తే లాక్ డౌన్ తర్వాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ మళ్ళీ పుంజుకున్నట్లే అని చెబుతున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కరోనా భయాల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు ముఖ్యంగా ఆన్ లైన్ మార్గాన్నే ఎంచుకున్నట్లు తెలిపారు.

Next Story
Share it