Telugu Gateway
Top Stories

భారత జీడీపీపై ఐఎంఎఫ్ అంచనా

భారత జీడీపీపై ఐఎంఎఫ్ అంచనా
X

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 10.3 శాతం మేర పతనం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కోవిడ్ 19 కారణంగానే ఈ పరిస్థితి వస్తోందని పేర్కొంది. వాస్తవానికి జూన్ లో నే ఐఎంఎఫ్ జీడీపీ పతనం 4.5 శాతంగా ఉంటుందని వెల్లడించింది.

మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 10.3 శాతానికి పెంచటం విశేషం. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వృద్ధితో భారత్ తిరిగి వృద్ధిపథంలోకి వస్తుందని అంచనా వేస్తోంది. జూన్ లో ఈ అంచనా ను ఐఎంఎఫ్ ఆరు శాతంగా పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ లో ఐఎంఎఫ్ ఈ అంచనాలను వెల్లడించింది.

Next Story
Share it