Telugu Gateway
Top Stories

భారత్ లో ఆరు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులుI

భారత్ లో ఆరు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులుI
X

బెంగూళూరు..తెలంగాణలోనూ కేసుల గుర్తింపు

యూకెను వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది .ఈ విషయాన్ని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కొత్త వైరస్ పై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటం ఒక్కటే ఆందోళనకర అంశంగా ఇప్పటివరకూ గుర్తించారు. అవే లక్షణాలు ఉంటాయి..అవే చికిత్స అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో భారత్ లోకి వచ్చిన యూకె రిటర్నీల్లో ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ వచ్చినట్లు అధికారికంగా తెలిపారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తం అయింది. దేశంలో కొత్తగా ఆరు కేసులు వెలుగుచూశాయి. అందులో బెంగుళూరులోని నింహన్స్ లో మూడు, హైదరాబాద్ లోని సీసీఎంబీలో రెండు, పూణేలోని ఎన్ ఐవిలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు.

వీరందరిని ఆయా ప్రాంతాల్లో సింగిల్ రూమ్ ఐసోలేషన్ లో ఉంచారు. ఇప్పుడు కొత్త స్టెయిన్ సోకిన వారి కాంటాక్ట్స్ ను ట్రేసింగ్ చేసే పని ప్రారంభించారు. కొత్త స్ట్రెయిన్ కారణంగా బ్రిటన్, దక్షిణాప్రికాల్లో కొత్త కేసుల పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ స్టెయిన్ కారణంగానే భారత్ తో సహా ప్రపంచ దేశాలు యూకెకు విమానరాకపోకలు నిలిపివేశాయి. ఈ స్ట్రెయిన్ వెలుగుచూసిన తర్వాత బ్రిటన్ నుంచి భారత్ కు ఏకంగా 33 వేల మంది వచ్చినట్లు అంచనా ఉంది. వేర్వేరు విమానాశ్రయాల ద్వారా భారత్ లోకి వచ్చారు.

Next Story
Share it