Telugu Gateway
Top Stories

ప్రపంచంలో అతి పెద్ద ఆఫీస్ ఇప్పుడు భారత్ లో

ప్రపంచంలో  అతి పెద్ద ఆఫీస్ ఇప్పుడు భారత్ లో
X

అగ్రరాజ్యం అమెరికా పేరున ఎనభై ఏళ్ళ పాటు ఉన్న రికార్డు ను భారత్ బీట్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ అమెరికాలోని పెంటగాన్ కార్యాలయమే. కానీ ఇప్పుడు అది భారత్ లో వచ్చింది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోని సూరత్ లో. మొత్తం 35 ఎకరాల్లో..ఏకంగా 71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం సిద్ధం అయింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నవంబర్ లో ప్రారంభించబోతున్నారు. ఈ భవన నిర్మాణానానికి నాలుగేళ్ళ సమయం పట్టింది. సూరత్ కు ప్రపంచ వజ్రాల రాజధానిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ కొత్త ఆఫీస్ భవనం కూడా వజ్రాల వ్యాపారానికి సంబదించిన అన్ని విభాగాల కోసం నిర్మించారు. 65 వేల మంది ఇక్కడ వ్యాపారం చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇందులో వజ్రాల ను పాలిష్ చేసే వాళ్ళతో పాటు కట్ చేసే వారు..ట్రేడర్స్ ఇలా అందరూ ఉంటారు. వినూత్న డిజైన్ తో ఒక్కో బిల్డింగ్ పదిహేను అంతస్తులతో చూపరులను ఆకట్టుకుంటుంది.

ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మందికి నిత్యం ప్రయాణం చేయాల్సిన అవసరం తప్పుతుంది అని సూరత్ డైమండ్ బోర్సు సీఈఓ మహేష్ గడివి వెల్లడించారు. ఇది లాభదాయక కంపెనీ కాదు అని...సెక్షన్ 8 కింద దీన్ని నమోదు చేశామని..వజ్రాల వ్యాపారం ప్రమోషన్ కోసం దీన్ని తలపెట్టినట్లు వెల్లడించారు. ఈ భవనము నిర్మాణానికి ముందే ఇందులో ఆఫీస్ స్పేస్ అమ్ముడు అయిపోయింది. ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిన ఆ భవనం పేరు సూరత్ డైమండ్ బోర్సు (SDB) .ఇందులో పార్కింగ్ ఏరియా తో పాటు రిక్రియేషన్ జోన్ ను 20 లక్ష చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ ఆర్కిటెక్చర్ మోర్ఫొగెనెసిస్ అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని ఈ భవన్ ఈ డిజైన్ బాధ్యతలను దక్కించుకుంది.

Next Story
Share it