అంతా సేఫ్

బాల్‌రూమ్ బయట తుపాకీ పేలుతున్న చప్పుళ్లు వినిపించటం తో అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం అయ్యారు. శబ్దాలు విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపైకి దూసుకెళ్లి, వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ట్రంప్ దంపతులతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కీలక నాయకులను అక్కడినుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. భయాందోళనకు గురైన బాల్‌రూమ్‌లోని మీడియా ప్రతినిధులు, అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. ఈ ఘటనలో డిన్నర్‌లో పాల్గొన్న ఎవ్వరికీ ఏమీ కాలేదు. కాల్పులకు దిగిన వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి 5 నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
కాల్పుల జరిపిన వ్యక్తం వివిధ రకాల ఆయుధాలతో వచ్చినట్లు భద్రతా అధికారులు గుర్తించారు. అతను కూడా హిల్టన్ హోటల్ లో గెస్ట్ గా దిగి ఈ కాల్పులకు పాల్పడటం విశేషం. ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా సీక్రెట్ సర్వీస్ తో పాటు ఇతర అధికారులు సమయస్ఫూర్తితో వేగంగా స్పందించారు అన్నారు. తన అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నది అని తనకు తెలుసు అని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే తాను భయపడుతూ బతికే రకం కాదు అన్నారు. శక్తివంతమైన గన్ తో దుండగుడు కాల్పులు చేశాడు అని ట్రంప్ తెలిపారు. నిందితుడిని 31 సంవత్సరాల కోలో టామెస్ అలెన్ గా గుర్తించారు. అతడు టీచర్ గా పనిచేస్తున్నాడు. అతను నివాసం ఉండేది కాలిఫోర్నియాలో. అతని అపార్ట్మెంట్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



