Telugu Gateway
Top Stories

మోతేరా స్టేడియానికి నరేంద్రమోడీ పేరు

మోతేరా స్టేడియానికి నరేంద్రమోడీ పేరు
X

ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. అధికారంలో ఉండగానే తన పేరును ప్రపంచంలో అతి పెద్ద అంతర్జాతీయ స్టేడియంగా ఉన్న మొతేరాకు ఆయన పేరు పెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పేర్లుపెట్టుకునే వ్యవహారం జోరుగా సాగుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో నిర్మించిన (మొతేరా) స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ స్టేడియంలోనే గతంలో 'నమస్టే ట్రంప్' కార్యక్రమం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. సర్దాల్‌ పటేల్‌ స్టేడియానికి ప్రధాని మోదీ పేరు పెట్టడం మరో విశేషం. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి కిరెన్ రిజిజు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ గవర్నర్, బీసీసీఐ కార్యదర్శి జే షా తదితరులు పాల్గొన్నారు. మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ , నరేంద్ర మోదీ స్టేడియాలకు తోడుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మించనున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు.

ఈ మూడు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల ఆతిథ్యానికి సన్నద్ధమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ భారతదేశ 'స్పోర్ట్స్ సిటీ' గా ఖ్యాతికెక్కనుందని ఆయన తెలిపారు. 700 కోట్ల రూపాయల వ్యయంతో లక్షా పది వేల ప్రేక్షకుల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్డేడియంగా అవతరించిన ఈ స్టేడియంలో మొట్టమొదటి మ్యాచ్‌ నేడు 2.30 గంటలకు భారత్‌, ఇంగ్లండ్‌లజట్ల మధ్య మూడో టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 3నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కూడా నుంచి ఇదే స్టేడియం వేదిక కానుంది. తాజా పరిణామంతో ఇప్పటివరకూ వరల్డ్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ రెండో స్థానానికే పరిమితం కానుంది. కాగా 2017 జనవరిలో ఈ స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించారు.

Next Story
Share it