Telugu Gateway
Top Stories

అదానీ అలా చెప్పారు

అదానీ అలా చెప్పారు
X

ఇది అదానీ మాట. మోడీ ప్రధాని అయినా తర్వాత పెద్ద ఎత్తున లబ్ది పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ఈ వ్యాఖలు చేయటం ఆసక్తి కరంగా మారింది. మోడీ తో జాతీయ ప్రయోజనాలతో కూడిన విధానాలపై మాట్లాడవచ్చు కానీ అయన నుంచి వ్యక్తిగతంగా లబ్ది పొందలేమని అదానీ వెల్లడించారు. ఒకసారి విధానం రూపొందించిన తర్వాత అది అందరికి వర్తిస్తుంది అని తెలిపారు. అదానీ గ్రూప్ దేశంలోని 22 రాష్టాల్లో వ్యాపారం చేస్తోందని...అవి అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కావని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళ తో పాటు మమతా బెనర్జీ సీఎం గా ఉన్న వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కెసిఆర్ సీఎం గా ఉన్న తెలంగాణ, జగన్ సీఎం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తమ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు.

ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ అదానీ ఈ వ్యాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ప్రధాని మోడీ కేవలం ఇద్దరు పారిశ్రామిక వేత్తల కోసమే పని చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. దీనికి కౌంటర్ గా అన్నట్లు అదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాష్ట్రంలో కూడా తాము భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో అదానీ గ్రూప్ కు విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందిగా మోడీ ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం పెద్ద రాజకీయ దుమారం రేపించా విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ ఎప్పటినుంచో పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోడీ ప్రధాని అయినా తర్వాతే ఈ గ్రూప్ సంపద అనూహ్యంగా పెరిగింది అని లెక్కలతో సహా పలు కథనాలు వెలువడ్డాయి. అయినా సరే అదానీ మాత్రం మోడీ నుంచి ఎవరూ వ్యక్తిగత సాయం పొందలేరు అని చెపుతున్నారు.

Next Story
Share it