హైదరాబాద్-బాగ్దాద్ ల మధ్య డైరక్ట్ విమాన సర్వీసులు
హెల్త్ కేర్ రాజధానిగా, అంతర్జాతీయ పర్యాటకులకు హైదరాబాద్ చాలా ప్రాముఖ్యత పొందింది. తక్కువ ఖర్చుతో, ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో, హైదరాబాద్ దేశంలోనే మెడికల్ టూరిజానికి ఊతమిస్తోంది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటీవల హైదరాబాద్-ఢాకా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ దిశగా బాగ్దాద్ సర్వీసు రెండోది. ఇరాక్ రాజధాని నగరాలైన బాగ్దాద్, కర్బలాలకు చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి యేడాదీ వేలాది మంది భారతీయులు బాగ్దాద్, కర్బలాకు ప్రయాణిస్తుంటారు. పవిత్ర నగరం కర్బలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి, ఇది బాగ్దాద్ సమీపంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు సంవత్సరానికి రెండుసార్లు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇరాక్‌లోని ఇతర ముఖ్య ప్రదేశాలు బాగ్దాద్‌లోని అబ్దుల్ ఖాదిర్ గిలానీ మరియు నజాఫ్‌లోని ఇమామ్ అలీ యొక్క పుణ్యక్షేత్రాలు. టైగ్రిస్ నదిపై ఉన్న బాబిలోనియా శిధిలాలను కూడా భారతీయులు సందర్శిస్తారని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.