Telugu Gateway
Top Stories

దుబాయ్ బుర్జ్ ఖలీఫా ధగధగలు

దుబాయ్ బుర్జ్ ఖలీఫా ధగధగలు
X

దుబాయ్ న్యూయర్ వేడుకల్లో ప్రతిసారి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అదేంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం, ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన బుర్జ్ ఖలీఫాలో జరిగే క్రాకర్స్ వేడుక. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా బుర్జ్ ఖలీఫా నుంచి సాగే ఈ ఫైర్ క్రాకర్స్ వేడుక చూడటానికే లక్షలాది ఆ ప్రాంతానికి తరలివస్తారు.దీని కోసం ఆ సమయంలో బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో రహదారులు అన్నీ మూసేస్తారు కూడా. నూతన సంవత్సర వేడుకలు చెబుతూ ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

దానికి సంబంధించినదే ఈ ఫోటో. ప్రస్తుతం దుబాయ్ లో ప్రతి ఏటా జరిగే షాపింగ్ ఫెస్టివల్ సాగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఈ సమయంలో దుబాయ్ చేరుకుంటారు. వాతావరణ పరంగా దుబాయ్ పర్యటనకు ఇది అనువైన సమయం కూడా. విజిట్ దుబాయ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ అద్భతమైన ఫోటోను షేర్ చేశారు.

Next Story
Share it