Telugu Gateway
Top Stories

న్యూ లుక్ లో ఎలాన్ మస్క్...వైరల్ ఫోటో

న్యూ లుక్ లో ఎలాన్ మస్క్...వైరల్ ఫోటో
X

ఎలాన్ మస్క్. ప్రపంచంలో ఇప్పుడు అయన ఒక ఒక పెద్ద హాట్ టాపిక్. ఎందుకంటే ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయనే నంబర్ వన్ కాబట్టి . అప్పుడప్పుడు రెండవ ప్లేస్ లోకి వెళ్లినా మళ్ళీ వెంటనే ఫస్ట్ ప్లేస్ లోకి రావటం అలా జరిగిపోతూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం కూడా అలాగే జరిగింది. ప్రపంచంలోనే నంబర్ వన్ సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్ కు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం ఆ ఫోటో ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జెనరేట్ చేయటం ఒకటి అయితే...చిన్న పిల్లాడిగా ఎలాన్ మస్క్ ఎంతో ముద్దుగా ఉండటంతో ఇది ట్విట్టర్ లో దుమ్ము రేపుతోంది. ఏఐ ఆధారిత ఫోటో ను చూసి ఒక ట్విట్టర్ యూజర్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.

అదేంటి అంటే..ఎలాన్ మస్క్ ప్రజలు ముసలి వాళ్ళు కాకుండా ఉండే యాంటీ ఏజింగ్ ఫార్ములా పై పనిచేస్తున్నారు..అయితే ఇప్పుడు అది అయన చేయి దాటిపోయింది అంటూ రాసుకొచ్చారు. దీనిపై ఎలాన్ మస్క్ కూడా అంతే సరదాగా స్పందించారు. తాను మరీ ఎక్కువ తీసుకున్నట్లు ఉన్నాను అంటూ కామెంట్ చేశారు. ఎలాన్ మస్క్ ఇప్పటికే న్యూరా లింక్ ప్రాజెక్ట్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇది మనిషి మెదడులో ఇంప్లాంటబుల్ చిప్ పెట్టే ప్రాజెక్ట్. ఇప్పుడు జంతువులపై ఈ పరీక్షలు సాగుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కూడా భారతీయ సాంప్రదాయ దుస్తులతో ఏఐ ఆధారిత ఎలాన్ మస్క్ ఫోటో ను జెనరేట్ చేశారు. అప్పటిలో అది కూడా అందరి దృష్టిని ఆకర్షిచింది. ఇప్పుడు బుల్లి మస్క్ ఫోటో అయితే వైరల్ గా మారింది.

Next Story
Share it