Telugu Gateway
Top Stories

చెత్తబుట్టలో అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్'!

చెత్తబుట్టలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ తరుణంలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. బెర్లిన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో డొనాల్డ్ ట్రంప్ మైనపు బొమ్మను చెత్త బుట్టలో పడేశారు. అంతే కాదు..అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చేందుకు ట్రంప్ ను పడేయండి అనే స్లోగన్ కూడా రాశారు. వీటితోపాటు ట్రంప్ ట్వీట్లను కూడా ఆ బొమ్మకు జోడించారు.'ఫేక్ న్యూస్, ఐ లవ్ బెర్లిన్, యూ ఆర్ ఫైర్డ్' వంటి ట్వీట్లను ట్రంప్ బొమ్మతో పెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సింబాలిక్ గా మైనపు బొమ్మ పెట్టినట్లు మ్యూజియం తెలిపింది. ఇప్పటికే కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. జో బైడెన్ కంటే ట్రంప్ వెనకబడి ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముందస్తు సన్నాహాక చర్యగా తాము ఈ పని చేశామని మ్యూజియం మార్కెటింగ్ మేనేజర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తాము ఈ బొమ్మ ద్వారా చెప్పామన్నారు. బహుశా ఏ అమెరికా అధ్యక్షడు కూడా డొనాల్డ్ ట్రంప్ అంత వివాదాలను ఎదుర్కోలేదని చెప్పొచ్చు. తాజాగా అమెరికాలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటం ట్రంప్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్యం తో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ స్వయంగా కరోనా బారిన తర్వాత కూడా ఎన్నికల ప్రచార సభల్లో మాస్క్ లు విసిరేయటం వంటి వివాదాలకు కారణం అయ్యాయి.

Next Story
Share it