Telugu Gateway
Top Stories

డాక్టర్లకు లంచాలు..డాక్టర్ రెడ్డీస్ పై ఉక్రెయిన్ లో ఫిర్యాదు

డాక్టర్లకు లంచాలు..డాక్టర్ రెడ్డీస్ పై ఉక్రెయిన్ లో ఫిర్యాదు
X

డాక్టర్లకు లంచాలు ఇచ్చి ఫార్మా స్యూటికల్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటాయనే అంశంపై చాలా విమర్శలు ఉన్నాయి. అయితే పలు దేశాల్లో ఇలాంటి వాటిపై కఠిన చర్యలు ఉంటాయి. భారత్ లో అయితే ఇది పెద్ద ఎత్తున సాగుతుందనే విమర్శలు ఉన్నా..నియంత్రణా సంస్థలు ఏవీ వీటిని పెద్దగా పట్టించుకోవు. తమ మందులను ప్రమోట్ చేసినందుకు కొంత మంది బడా బడా డాక్టర్లకు ఆయా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇచ్చే వార్షిక బహుమతుల విలువ భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే భారత్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఇప్పుడు అలాంటి ఫిర్యాధే ఒకటి నమోదు అయింది.

ఇది ఉక్రెయిన్ లో. డాక్టర్లు, ఇతర వైద్య రంగ నిపుణులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారనే ఆరోపణలతో డాక్టర్ రెడ్దీపై ఫిర్యాదు లు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఫిర్యాదు చేశారు. ఉక్రెయిన్ తోపాటు ఇతర దేశాల్లోనూ ఇలా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లంచాలు ఇవ్వటం అనేది అమెరికా చట్టాలకు వ్యతిరేకం. దీంతో ఈ వ్యవహారంపై అమెరికాకు చెందిన పేరున్న న్యాయ సంస్థ ఈ వ్యవహారంపై విచారణ జరపనుంది. ఈ విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. డాక్టర్ రెడ్డీస్ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అయిన కంపెనీ కావటంతో విదేశాల్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తే వెంటనే నిజానిజాలు నిగ్గుతేల్చాల్సి ఉంటుంది.

Next Story
Share it