Telugu Gateway
Top Stories

డెల్...నమ్మదగ్గ బ్రాండ్

డెల్...నమ్మదగ్గ బ్రాండ్
X

బ్రాండ్ అంటే ఓ నమ్మకం. చాలా మంది నమ్మకంతోనే ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. ఓ సారి బ్రాండ్ పాపులర్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీకి తిరుగు ఉండదు. అందుకే దిగ్గజ సంస్థలు అన్నీ 'బ్రాండ్' కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తాయి. అలా వ్యయం చేయటమే కాదు..తమ ఉత్పత్తులను అదే రేంజ్ లో ఉంచుతాయి. కేవలం బ్రాండ్ ప్రమోట్ చేసేసి తర్వాత ఆయా ఉత్పత్తుల నాణ్యతలో రాజీపడితే మాత్రం అవి ఎక్కువ కాలం నిలబడలేవు. ఎంత నాణ్యమైన వస్తువులు అయినా సరే వాటికి అదే రేంజ్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకోవటం కూడా చాలా కీలకం. అప్పుడు ఏ కంపెనీ అయినా సక్సెస్ సాధించగలదు. తాజాగా టీఆర్‌ఏ రీసెర్చ్‌ సంస్థ నమ్మదగిన బ్రాండ్లపై సర్వే చేపట్టింది. అందులో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. డెల్.

కంప్యూటర్ల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ తెలిసే ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అది అంత పాపులర్ మరి. అందుకే 'డెల్‌' భారత్‌లో వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిల్చింది. చైనాకు చెందిన షావోమి మొబైల్స్‌ రెండో స్థానంలో, కొరియన్‌ దిగ్గజం శాంసంగ్‌ మొబైల్స్‌ మూడో స్థానంలో నిల్చాయి. టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ నాలుగో స్థానానికి పరిమితం అయింది. ఎల్‌జీ టెలివిజన్‌ అయిదో ర్యాంక్‌ దక్కించుకుంది. మొత్తంమీద ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఆటో మొబైల్‌ విభాగంలో మారుతి సుజుకీ మాత్రం అగ్రస్థానంలో నిల్చింది. 16 నగరాల్లో 1711మంది వినియోగదారులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 323 కేటగిరీల్లో మొత్తం 8 వేల బ్రాండ్స్‌ ను పరిగణనలోకి తీసుకున్నారు.

Next Story
Share it