Telugu Gateway
Top Stories

టీవీ ఛాన‌ల్ లో డేటా చౌర్యం కేసు..ముగ్గురు యాంక‌ర్ల‌పై వేటు!

టీవీ  ఛాన‌ల్ లో  డేటా చౌర్యం కేసు..ముగ్గురు యాంక‌ర్ల‌పై వేటు!
X

ఓ టాప్ టీవీ చాన‌ల్ లో చోటుచేసుకున్న డేటా చౌర్యం వ్య‌వ‌హారం మీడియా స‌ర్కిళ్ల‌లో దుమారం రేపుతోంది. ఓ యాంక‌ర్ కు సంబంధించిన ఫోన్ నుంచి మ‌రో ఇద్ద‌రు యాంక‌ర్లు డేటాను త‌స్క‌రించారు. అందులో వీడియోల‌తోపాటు ఎంతో విలువైన స‌మాచారం ఉండ‌టంతో ఆమె సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. అయినా కూడా పోలీసులు టాప్ టీవీ ఛాన‌ల్ కావ‌టంతో మీ అంత‌ట మీరు వివాదం ప‌రిష్క‌రించుకుంటే ఓకే..లేదంటే ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయాల్సి ఉంటుంద‌ని తెలిపిన‌ట్లు స‌మాచారం. అయినా స‌రే కూడా వివాదం ఎంత‌కూ ప‌రిష్కారం కాక‌పోవ‌టంతో ఓ యాంక‌ర్ ఫోన్ నుంచి డేటాను త‌స్క‌రించిన ఇద్ద‌రు యాంక‌ర్ల‌ను ఆ యాజ‌మాన్యం రిజైన్ చేయాల్సిందిగా ఆదేశించ‌టం..వారు రాజీనామా చేయ‌టం జ‌రిగాయి. దీంతో కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు యాంక‌ర్లు ఆ టీవీ ఛాన‌ల్ నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది.

బాధిత యాంక‌ర్ ఈ వ్య‌వ‌హారాన్ని అక్క‌డ బాధ్య‌త‌లు చూసే ప్ర‌ధాన ప్ర‌జంట‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌గా స‌మ‌స్య ప‌రిష్క‌రించాల్సిన ఆయ‌న కూడా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఫిర్యాదులో ఆయ‌న పేరు కూడా జ‌త‌చేసిన‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో బాధిత యాంక‌ర్ వేధించిన వారిలో ఓ హెచ్ ఆర్ అధికారి కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ వ్య‌వ‌హారం ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో...ఏమి అవుతుందో అన్న ఆందోళ‌న‌లో ఆ హెడ్ తోపాటు మ‌రికొంత మంది సిబ్బంది టెన్ష‌న్ టెన్ష‌న్ లో ఉన్నారు. అయితే బాధిత యాంక‌ర్ మాత్రం కేసు న‌మోదు చేసే వ‌రకూ ఊరుకునేది లేద‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు చెబుతున్నారు.

Next Story
Share it