Telugu Gateway
Top Stories

ఆక్సిజన్ తయారీ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు

ఆక్సిజన్ తయారీ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
X

కేంద్రం కరోనా సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా మరికొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. వచ్చే మూడు నెలల పాటు కోవిడ్‌ వ్యాక్సిన్‌ల దిగుమతిపై కస్టమ్స్‌ డ్యూటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ఆక్సిజన్ తయారు చేసే పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీ, హెల్త్‌ సెస్‌ను మాఫీ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం.. ఆక్సిజన్‌ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆక్సిజన్‌ సరఫరాను మెరుగు పర్చడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను వణికిస్తోంది. ఈ సారి ఆక్సిజన్‌ వినియోగం భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ హైకోర్లు, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కేంద్రం 150 రూపాయలకు సేకరించే వ్యాక్సిన్ ను ఉచితంగానే రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

Next Story
Share it