Telugu Gateway
Top Stories

తెలుగుదేశం కమిటీల ప్రకటన

తెలుగుదేశం కమిటీల ప్రకటన
X

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల కమిటీలను ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కె. అచ్చెన్నాయుడిని నియమించారు. తెలంగాణకు మాత్రం ఎల్. రమణనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీతోపాటు..పొలిట్ బ్యూరో సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు ప్రకటించారు. పొలిట్ బ్యూరోలో ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చోటు కల్పించారు. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి కూడా పొలిట్ బ్యూరో లో చోటు దక్కింది. వీరితోపాటు యనమల రామకృష్ణుడు, పి. ఆశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కె ఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, ఎన్ఎండీ ఫరూఖ్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ సభ్యులుగా ఉన్నారు.

నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఎల్ రమణలు వారి వారి హోదాల కారణంగా పొలిట్ బ్యూరో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. పార్టీ జాతీయ కమిటీలో ఐదుగురు నేతలకు జాతీయ పార్టీ ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టారు. అందులో కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణకుమారి, డి కె సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు, చిలువేరు కాశీనాథ్ లు ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, కింజరాపు రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్త కోట దయాకర్ రెడ్డి, బక్కని నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్ రావులు ఉన్నారు.

Next Story
Share it