Telugu Gateway
Top Stories

కరోనా వ్యాక్సిన్ పై సీసీఎంబీ కీలక ప్రకటన

కరోనా వ్యాక్సిన్ పై సీసీఎంబీ కీలక ప్రకటన
X

ఇదిగో డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ రెడీ. డిసెంబర్ కు సాధ్యం కాకపోతే జనవరిలో మాత్రం పక్కా. కాకపోతే వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పడుతుంది. ఇవీ గత కొంత కాలంగా ప్రజలందరూ వింటున్న ప్రకటనలు. భారత ప్రభుత్వం అయితే వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ తరుణంలో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) కీలక ప్రకటన చేసింది. చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ తయారీ ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉందని, వాటన్నింటినీ పూర్తి చేసుకుని అందుబాటులోకి రావాంటే మరో ఏడాది సమయం పటుడుతుందని తెలిపింది. ఈ మేరకు సీసీఎంబీ సీఈవో మదుసూధన్‌రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గురువారం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా కేసులు మాత్రమే తగ్గాయని, తీవ్రత తగ్గలేదని అన్నారు. వైరస్‌ విజృంభణ ఇలానే కొనసాగితే మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ విధించక తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారువుతున్న వ్యాక్సిన్స్‌లో ఏది ఏవిధంగా పనిచేస్తుందో కూడా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాల్లో చాలా కష్టపడుతున్నాయని, కానీ అనుకున్నంత సామన్యంగా అందుబాటులోకి రాదని పేర్కొన్నారు. పలు దేశాల్లో తొలి దశ ప్రయోగాలను పూర్తి చేసుకుని చివరి దశ ప్రయోగాల్లో ఉంది.

Next Story
Share it