Top
Telugu Gateway

బోయింగ్ 737 విమానాలు ఓకే

బోయింగ్ 737 విమానాలు ఓకే
X

యూరోపియన్ యూనియన్ విమానయాన రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు సురక్షితమైనవేనని స్పష్టం చేసింది. 2020 సంవత్సరాంతం నాటికి ఇవి ప్రాంతీయ గగనతలంలో ఎగిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియంత్రణా సంస్థ డిమాండ్ చేసిన సాఫ్ట్ వేర్ అప్ గ్రేడేషన్ మరో రెండేళ్ల వరకూ సాధ్యం కాదనే ప్రకటన వెలువడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం.

భయంకరమైన ప్రమాదాల కారణంగా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను 2019 మార్చిలో నిలిపివేశారు. బోయింగ్ కంపెనీ చేసిన మార్పుల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్లు నియంత్రణా సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా వీటిని నడిపి చూసిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. యూరోపియన్ యూనియన్ రెగ్యులేటర్ గ్రీన్ సిగ్నల్ తో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి.

Next Story
Share it