Telugu Gateway
Top Stories

అర్ణాబ్ గోస్వామి అరెస్ట్

అర్ణాబ్ గోస్వామి అరెస్ట్
X

ముంబయ్ లో బుధవారం ఉధయమే కలకలం. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణాబ్ గోస్వామిని ముంబయ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అర్ణాబ్ గోస్వామి ఇంటికి వెళ్ళి ఆయన్ను భారీ కాన్వాయ్ లో తరలించారు. ఆ కాన్వాయ్ ను రిపబ్లిక్ టీవీ ఛానల్ బృందం ఫాలో అవుతూ నానా హంగామా చేసింది. అర్ణాబ్ ఇంట్లోకి వెళ్లి పోలీసులు దౌర్జన్యం చేశారని..చుట్టుపట్టుకుని లాక్కెళ్ళారని ఆరోపించింది. పోలీసులు సెక్షన్ 306 కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతన్నారు. బ్ ను ఇంటి నుంచి బలవంతంగానే తీసుకెళ్ళారు. 20 నుంచి 30 మంది పోలీసులు అర్ణాబ్ ను తీసుకెళ్ళారని ఛానల్ ప్రతినిధులు ఆరోపించారు.

అయితే గతంలో మూసివేసిన కేసును మళ్ళీ ఓపెన్ చేసి అరెస్ట్ చేశారన్నది రిపబ్లిక్ టీవీ చానల్ ఆరోపణ. పోలీసులు బెదిరించి మరీ తీసుకెళ్ళారని, ఇంట్లో జరిగిన సంఘటనలతో పాటు అన్నీ రికార్డు అయ్యాయని , ముంబయ్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఛానల్ చెబుతోంది. రిపబ్లిక్ టీవీ మహారాష్ట్ సర్కారు ను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయటంతో అక్కడి ప్రభుత్వం కూడా అదే రీతిలో రిపబ్లిక్ టీవీని కూడా టార్గెట్ చేసింది. ఇటీవలే టీఆర్పీ స్కామ్ విషయంలో కూడా రిపబ్లిక్ టీవీపై ముంబయ్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు కూడా ఇఛ్చారు.

Next Story
Share it