Telugu Gateway
Top Stories

ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ

ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ
X

ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధం అయింది. ఇప్పటి వరకూ సౌదీ అరేబియాకు చెందిన అరామ్ కోదే అతి పెద్ద ఐపివో. అరామ్ కో మార్కెట్ నుంచి 29 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఇప్పుడు చైనాకు చెందిన ఫిన్ టెక్ కంపెనీ యాంట్ గ్రూప్ 34.5 బిలియన్ డాలర్ల ఐపీవోకు రెడీ అయింది. యాంట్ గ్రూప్ బిలియనీర్ జాక్ మా అలీబాబా గ్రూప్ నకు చెందిన అనుబంధ సంస్థ.

అయితే ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మార్కెట్ న్యూస్ చెబుతున్నాయి. న్యూయార్క్ వెలుపల ఇంత పెద్ద లిస్టింగ్ జరగనుండటం అద్భుతం అని జాక్ మా వ్యాఖ్యానించారు. యాంట్ గ్రూపు షేర్లు నవంబర్ 5న హాంకాంగ్, షాంఘై ఎక్స్చేంజ్ ల్లో లిస్ట్ కానున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన రెండు రోజుల తర్వాత ఇవి లిస్ట్ కానుండటం గమనార్హం.

Next Story
Share it