డిసెంబర్ 11 నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్
కీలక పరిణామం. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న అమెరికా ప్రజలకు ఖచ్చితంగా ఇది శుభవార్తే. డిసెంబర్ 11 నుంచి అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అమెరికాకు చెందిన వ్యాక్సిన్ కార్యక్రమ ప్రధానాధికారి మోన్సాఫ్ సలోయి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్క డిసెంబర్ లోనే అమెరికాలో రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరాలంటే అమెరికా జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరరం ఉందని తెలిపారు. ఇది మే నాటికి పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసులు 1.2 కోట్లకు చేరగా..2.56 లక్షల మంది మృత్యువాడ పడ్డారు.
అమెరికాకు చెందిన రెండు సంస్థలు ఫైజర్, మోడెర్నాలు తమ మత వ్యాక్సిన్లు విజయవంతం అయ్యాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా సుమారు 95 శాతం మేర సమర్థతతో పనిచేస్తున్నాయని తెలిపాయి. అయితే ఇవి ఇప్పుడు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డిఏ) నుంచి అత్యవసర అనుమతులు పొంది కరోనాతో అల్లకల్లోలం అవుతున్న అమెరికాలో కోవిడ్ కు చెక్ పెట్టేందకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.