Telugu Gateway
Top Stories

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోం వచ్చే ఏడాది జూన్ వరకూ

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోం వచ్చే ఏడాది జూన్ వరకూ
X

కరోనా ఆఫీసు పద్దతులనే మార్చేసింది. ఒకప్పుడు ఏదో కొంత మందికి మాత్రమే పరిమితమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇప్పుడు ప్రతి ఆఫీసులోనూ కామన్ అయింది. ఒకప్పుడు ఈ పేరు వినని సంస్థలు కూడా ఇదే మోడల్ ను ఫాలో అవుతున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వల్ల పలు సంస్థలకు పెద్ద సంఖ్యలో డబ్బు ఆదా అవుతుండగా..ఉద్యోగులు కూడా ట్రాఫిక్ కష్టాలను..డ్రైవింగ్ సమయాన్ని కూడా ఆదా చేసుకుంటున్నారు. అయితే వాణిజ్య ఆఫీస్ స్పేస్ పై ఇది ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఇప్పటికిప్పుడే చెప్పటం కష్టం అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆఫీస్ స్పేస్ డిమాండ్ మాత్రం చాలా చోట్ల గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు వచ్చే సంవత్సరం తొలి ఆరు నెలల వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ ను ఎంచుకున్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.

ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2021, జూన్ 30 వరకు ఇంటినుండి పని చేయగల ఉద్యోగులకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నామని అమెజాన్ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ వచ్చే ఏడాది జులై వరకు, గూగుల్ 2021 జూన్ వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ అమెరికాలో పనిచేస్తున్న19వేల మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. గిడ్డంగులను తెరిచి ఉంచడమే వైరస్ విస్తరణకు దారితీసిందంటూ గతంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, ఫేస్ మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లు లాంటి కోవిడ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని అమెజాన్ ప్రకటించింది.

Next Story
Share it