Telugu Gateway
Top Stories

మాంద్యం వేళ కళ్ళు చెదిరే పారితోషికం

మాంద్యం వేళ కళ్ళు చెదిరే పారితోషికం
X

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఐటి కంపెనీలు అన్ని పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి.ఇంకా తొలగిస్తూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో 2022 లో ఉద్యోగులపై వేటు పడింది. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన వాటిలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా ఉంది. మాంద్యం కారణంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఏకంగా పన్నెండు వేల మందిని తీసివేస్తున్నట్లు తెలిపింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సుందర్ పిచాయ్ 2022 సంవత్సరంలో అన్ని కలుపుకుని ఏకంగా 1854 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నారు.

ఇందులో వేతనం తో పాటు స్టాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సుందర్ పిచాయ్ అందుకున్న మొత్తం చూస్తే ఇది సగటు ఉద్యోగి అందుకునే వేతనం కంటే 800 రేట్లు ఎక్కువ అని చెపుతున్నారు. ఈ మొత్తంలో ఎక్కువ స్టాక్ అవార్డులే ఎక్కువగా ఉన్నాయి. మూడేళ్ళ కాలానికి ఆయనకు ఈ స్టాక్ అవార్డులు వచ్చాయి. 2019 లో కూడా ఇదే స్థాయిలో సుందర్ పిచాయ్ స్టాక్ అవార్డ్స్ అందుకున్నారు. అయితే ప్రతి ఏటా సుందర్ పిచాయ్ కు అందే వేతనం రెండు మిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే. ఇప్పుడు సుందర్ పిచాయ్ అందుకున్న మొత్తం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it