Telugu Gateway
Top Stories

వుహాన్ కు కరోనాను ఎగుమతి చేసిన ఫ్లైట్!

వుహాన్ కు కరోనాను ఎగుమతి చేసిన ఫ్లైట్!
X

వుహాన్. ఈ పేరే అందరినీ వణికించింది. ఇప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టింది అక్కడే అన్న విషయం తెలిసిందే. అయితే వుహాన్ ఎప్పుడో కరోనా రహిత నగరంగా మారిపోయింది. ఈ తరుణంలో ఓ విమానం వుహాన్ కు కరోనాను ఎగుమతి చేసింది. అది భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా కావటం విశేషం. అసలు సంగతి ఏంటి అంటే గత శుక్రవారం నాడు వందే భారత్ మిషన్ లో భాగంగా న్యూఢిల్లీ నుంచి చైనాలోని వుహాన్ కు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి వెళ్లింది. ఈ విమానంలో మొత్తం 277 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 19 మందికి అక్కడికి వెళ్ళాక టెస్ట్ లు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.

వీరితో పాటు మరో 39 మంది ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా బాధితులుగా గుర్తించారు. ఎందుకంటే వీరిలో యాంటీబాడీస్ ఉన్నాయి. కరోనా పాజిటివ్ గా గుర్తించిన వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వుహాన్ లో తాత్కాలిక పర్మిట్ వీసా ఉన్న వారిపై ఆంక్షలు ఎత్తేయటంతో భారత్ నుంచి వుహాన్ కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని..వందే భారత్ మిషన్ విమానాల కోసం డిమాండ్ పెరుగుతోందని అధకారులు చెబుతున్నారు . అయితే ప్రస్తుతం కరోనా బారిన పడిన వారిని నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే బయటకు విడిచిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story
Share it