Telugu Gateway
Telugugateway Exclusives

లక్షల్లో తగ్గిన తెలుగు పత్రికల సర్కులేషన్!

లక్షల్లో తగ్గిన తెలుగు పత్రికల సర్కులేషన్!
X

ఊహించిన దాని కంటే చాలా వేగంగా పాఠకులు ప్రింట్ మీడియాకు దూరం అవుతున్నారా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ మీడియాకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది వార్తలను యాప్స్, వెబ్ సైట్స్ మార్గాల ద్వారానే తెలుసుకుంటున్నారు. ఇందులో ప్రధాన పత్రికల సైట్స్ దీ సింహభాగమే. డిజిటల్ మీడియాను ఆశ్రయించే వారిలో ఎక్కువ మంది కొత్తతరమే. ఇది అంతా ఒకెత్తు అయితే ప్రింట్ మీడియాపై కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలటంతో పత్రికలకు ప్రధాన ఆదాయ వనరు అయిన యాడ్స్ గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ యాడ్స్ పుంజుకున్నా..ఈ మధ్య కాలంలోనే ప్రధాన పత్రికల సర్కులేషన్ లక్షల్లో తగ్గింది. ఇందుకు ఏ పత్రిక మినహాయింపు కాదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అన్ని ప్రధాన పత్రికల సర్కులేషన్ లక్షల్లో తగ్గిన మాట వాస్తవం అని..వచ్చే ఏబీసీ లెక్కల్లో అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. అయితే ఏ పత్రిక కూడా ఇప్పుడు తగ్గిన తమ సర్కులేషన్ ను పెంచుకునే ప్రయత్నం చేయటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే ప్రధాన పత్రికల సర్కులేషన్ చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు.

ఇది ఇప్పట్లో తిరిగి రికవరి అయ్యే అవకాశాలు కూడా కన్పించటం లేదంటున్నారు. కరోనా కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడిన ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాపారాలు దెబ్బతిని.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవటం కూడా దీనికి కారణం అని చెబుతున్నరు. రాబోయేది అంతా డిజిటల్ యుగమే అని తెలుసుకున్న ప్రధాన మీడియా సంస్థలు కూడా వీటిపై గతం కంటే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ప్రింట్ మీడియా అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావటంతో అవకాశం ఉన్న చోట అంతా వ్యయాన్ని తగ్గించుకుంటూ పోతున్నారు. కరోనా కారణంగా అగ్రశ్రేణి పత్రికలు కూడా వేతనాల్లో భారీగా కోతలు పెట్టడంతో పాటు ఉద్యోగులు అందరికీ లే ఆఫ్స్ ఇవ్వటం, గతంలో ఇచ్చిన పలు సౌకర్యాలకు మంగళం పాడాయి. ఇప్పుడు సర్కులేషన్ కూడా భారీగా తగ్గటంతో ప్రింట్ మీడియాలోని ఉద్యోగులు ఒకింత ఆందోళన పడే పరిస్థితి నెలకొంది.

Next Story
Share it