Telugu Gateway
Telugugateway Exclusives

సాక్షి 'రివర్స్ గేర్'

సాక్షి రివర్స్ గేర్
X

టాబ్లాయిడ్ కు గుడ్ బై

ఈనాడు, ఆంధ్రజ్యోతి బాటలోనే సాక్షి కూడా...మెయిన్ లోనే జిల్లా పేజీలు

కరోనా సమయంలోనూ సాక్షి నా దారి రహదారి అన్నది. ప్రధాన పత్రికలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కరోనా సమయంలో నష్టాలు తగ్గించుకునేందుకు జిల్లా టాబ్లాయిడ్ లకు మంగళం పాడాయి. కానీ సాక్షి మధ్యలో టాబ్లాయిడ్ లను పునరుద్ధరించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం బ్రాడ్ షీట్ లోనే జిల్లా పేజీలను కొనసాగిస్తున్నాయి. ఆ పత్రికలు తిరిగి జిల్లా పేజీలను పునరుద్ధరించే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. కానీ జిల్లా పేజీలను పునరుద్ధరించటం ద్వారా సాక్షి మార్కెట్ లో తన ప్రత్యేకతను నిలుపుకోవాలని సన్నాహాలు చేసింది. ఈ ప్రయత్నం చాలా వరకూ విజయవంతం అయింది కూడా. వాస్తవానికి కరోనా తొలి రోజులతో పోలిస్తే పత్రికలకు ప్రకటనలు పెరిగాయి. సాధారణ స్థితి వస్తోంది. కార్పొరేట్ యాడ్స్ తో పాటు ఇతర యాడ్స్ లోనూ గణనీయమైన పురోగతి కన్పిస్తోంది.

ఇక ఏపీలో అయితే సాక్షికి యాడ్స్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు.. ఎందుకంటే అక్కడ అధికారిక పత్రిక కాబట్టి నిత్యం ఫుల్ పేజీల ప్రకటనలతో కళకళలాడుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ యాడ్స్ కూడా అదే రీతిలో వస్తున్నాయి. వాస్తవానికి జిల్లాల పేజీలు విడిగా ఉంటే...వాటిని చదవటానికే ప్రాధాన్యత ఇచ్చే పాఠకులు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో సాక్షి రివర్స్ గేర్ వేయటం చర్చనీయాంశంగా ఉంది. మిగతా పత్రికలకు భిన్నంగా ఇప్పటివరకూ టాబ్లాయిడ్ తెచ్చినా ఆ మేరకు మెయిన్ లో పేజీలు తగ్గించారు. దీంతో అసలు సాక్షి పేపర్ పట్టుకుంటే చేతికి ఏ మాత్రం ఆనటం లేదు. ఇది కూడా ఓ మైనస్ పాయింట్ గా మారింది. దీంతో యాజమాన్యం టాబ్లాయిడ్స్ విషయంలో రివర్స్ గేర్ వేసినట్లు సమాచారం. ఏపీతోపాటు తెలంగాణలోనూ శుక్రవారం నుంచి జిల్లా పేజీలను మెయిన్ లో కలిపేశారు.

Next Story
Share it