Telugu Gateway
Telugugateway Exclusives

రవి ప్రకాష్ రీ ఎంట్రీ..రాజ్ న్యూస్ ఛైర్మన్ గా !

రవి ప్రకాష్ రీ ఎంట్రీ..రాజ్ న్యూస్ ఛైర్మన్ గా !
X

రవిప్రకాష్. ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ కొత్త ముద్ర వేసిన వ్యక్తి. గత కొంత కాలంగా వివాదాలతో మీడియాకు దూరంగా ఉన్నారు. టీవీ9 ప్రారంభంతోనే ఎన్నో సంచలనాలు నమోదు చేశారు. ఆ ఛానల్ ను అగ్రస్థానానికి తీసుకెళ్ళారు. టీవీ9 యాజమాన్యం చేతులు మారటం..రవిప్రకాష్ కు మైనారిటీ వాటా ఉన్న బయటకు రావటం..తర్వాత జరిగిన వివాదాలు అన్నీ తెలిసినవే. ఈ వ్యవహారంపై ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మళ్లీ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రాజ్ న్యూస్ ఛానల్ బాధ్యతలు చేపట్టారు. ఛానల్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించటమే కాకుండా ఛానల్ లో కొత్త టీమ్ నియామకానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించారు. రవిప్రకాష్ తన పాత టీమ్ లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించటం మొదలు పెట్టినట్లు సమాచారం.

దీంతో సహజంగానే మీడియాపై ఆసక్తి ఉన్న వారి కళ్లు అన్నీ రాజ్ న్యూస్ వైపు మళ్ళటం ఖాయం. మరి రవిప్రకాష్ తన సెకండ్ ఇన్సింగ్స్ తో ఏ మేరకు మీడియాలో ప్రభావం చూపిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రవిప్రకాష్ కు ఓ ఇమేజ్ ఉంది. ప్రభుత్వాల పరంగా చూస్తే ఇప్పుడు తెలంగాణతోపాటు ఏపీలోనూ అనుకూల వాతారణం అయితే ఏ మాత్రం లేదనే చెప్పాలి. ఈ తరుణంలో రవిప్రకాష్ సారధ్యంలో రాజ్ న్యూస్ కొత్త వైభవం సాధిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. అయితే రాజ్ న్యూస్ లో రవిప్రకాష్ వాటాలు కొనుగోలు చేశారా?. లేక ఇతర ఒప్పందాలు చేసుకున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. మీడియా సర్కిళ్ళలో ఉన్న సమాచారం ప్రకారం ఐదేళ్ళ పాటు ఛానల్ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

Next Story
Share it