అల్లుడు లోకేష్ పైనా బాలకృష్ణ గరం గరం!
పొలిట్ బ్యూరో..విస్తృతస్థాయి సమావేశాలకు డుమ్మా
హిందుపురంలో మూడు రోజుల కార్యక్రమాలు
బయటి వాళ్లే కాదు...నారా లోకేష్ ను సొంత మనుషులు కూడా లైట్ తీసుకుంటున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది టీడీపీ నేతల దగ్గర నుంచి. పార్టీలో కీలక పదవి కోసం పట్టుబట్టిన నందమూరి బాలకృష్ణ తనకు ఆ పదవి దక్కకపోవటంతో పొలిట్ బ్యూరో సమావేశం దగ్గర నుంచి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి కూడా డుమ్మాకొట్టారు. అలాంటి బాలకృష్ణ బుధవారం నుంచి మూడు రోజుల పాటు హిందుపురం నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అంటే పొలిట్ బ్యూరో తోపాటు రాష్ట్ర స్థాయి సమావేశాలను లైట్ గా తీసుకున్న ఆయన మూడు రోజుల పాటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటంతోపాటు..లేపాక్షిలో రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. అంటే తన ఉద్దేశంతో ఏంటో చెప్పకనే చెప్పేశారు. బాలకృష్ణ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ డిస్కషన్ గా మారింది.
తనకు కావాల్సిన పదవిపై కొంత మంది నేతలతో మాట్లాడిన సందర్భంగా ఒకరిద్దరు నేతలు 'మీ అల్లుడే' కీలకంగా ఉన్నాడు కదా.. అని వ్యాఖ్యానించటంతో ఆయన ఆ సమయంలో 'పరుషమైన' వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యాఖ్యలు విని అవాక్కవటం ఆ నేతల వంతు అయింది. దీంతో బాలకృష్ణ ఇప్పుడు అటు చంద్రబాబునాయుడితోపాటు ఇటు నారా లోకేష్ పై కూడా గుర్రుగా ఉన్నారు. నారా లోకేష్ పై అయితే అధికార వైసీపీ నేతల టార్గెట్ మామూలుగా లేదు. దీనికి తోడు సొంత పార్టీలో..అది కూడా స్వయంగా మామ బాలకృష్ణే లోకేష్ పై కత్తికట్టడం..తనకూ పార్టీలో కీలక పదవి ఇవ్వాలని పట్టుబట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ కు అడ్డం వస్తాడనే అప్పట్లో పార్టీలో యాక్టివ్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను క్రమంగా పక్కకు తప్పించారు. ఇప్పుడు వెరైటీగా బాలకృష్ణ నుంచే చంద్రబాబుకు, నారా లోకేష్ సవాళ్లు ఎదురు కావటం విశేషం.