ఆ పెంట్ హౌస్ ఖరీదు 335 కోట్లు
BY Admin19 Oct 2020 2:38 PM GMT
X
Admin19 Oct 2020 2:38 PM GMT
ఈ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మరీ పెంట్ హౌస్ కు ఇంత ధరా అని ఆశ్చర్యపోతారు. కానీ అది ఉన్న ప్లేస్ అలాంటిది మరి. అందుకే దానికి అంత ధర. అయినా సరే సదరు కొనుగోలుదారుడు నష్టానికి అమ్ముకున్నట్లేనట. సింగపూర్ లోనే అత్యంత ఎత్తైన గూకో టవర్ లోని మూడు అంతస్థుల పెంట్ హౌస్ ను బ్రిటీష్ కు చెందిన బిలియనీర్ జేమ్స్ డైసన్ అమ్మేశారు.
ఈ ఐదు బెడ్ రూమ్స్ తో కూడిన పెంట్ హౌస్ కు 600 బాటిళ్ళ వైన్ సెల్లార్ ఉంది. దీంతో పాటు పూల్, అతి పెద్ద వాటర్ బాడీ మసాజ్ సిస్టమ్ తో కూడిన టబ్, ప్రైవేట్ గార్డెన్ ఉంటుంది. అక్కడ కూర్చుని సింగపూర్ అందాలను వీక్షించవచ్చు. ఇండోనేషియాకు చెందిన లియో కోగన్ ఈ పెంట్ హౌస్ ను కొనుగోలు చేశారని 'బిజినెస్ టైమ్స్' పేపర్ ఈ వార్తను ప్రచురించింది.
Next Story