Telugu Gateway
Telugugateway Exclusives

బ్యాంక్ ఫ్రాడ్ కేసులో కోస్టల్ ప్రాజెక్ట్స్ సురేంద్రకు తాత్కాలిక ఊరట

బ్యాంక్ ఫ్రాడ్ కేసులో కోస్టల్ ప్రాజెక్ట్స్ సురేంద్రకు తాత్కాలిక ఊరట
X

యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు

హైదరాబాద్ కు చెందిన కోస్టల్ ప్రాజెక్ట్స్ పై సీబీఐ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ 4736 కోట్ల రూపాయల మేర బ్యాంక్ లను మోసం చేసినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలో పెద్ద దుమారమే రేపింది. కంపెనీ సీఎండీ సబ్బినేని సురేంద్రతోపాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో సబ్బినేని సురేంద్ర హైకోర్టులో 438 సీఆర్ పీసీ కింద యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.

అయితే హైకోర్టు ఈ కేసు ను ఫిబ్రవరి 11 కి వాయిదా వేస్తూ..అప్పటివరకూ ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. ఎసీబీఐ నేతృత్వంలోని కన్సార్టియం కేసు నమోదు చేసింది. 2013 నుంచి 2018 కాలంలో ఈ మోసం జరిగినట్లు బ్యాంకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. సురేంద్ర యాంటిసిపేటరీ బెయిల్ పిటీషన్ పై తదుపరి విచారణ ఈ నెల11న జరగనుంది.

Next Story
Share it