Telugu Gateway
Telugugateway Exclusives

నిమిషంలో కరోనా పరీక్ష

నిమిషంలో కరోనా పరీక్ష
X

సింగపూర్ పరిశోధకుల సంచలనం

సింగపూర్ పరిశోధకుల సంచలనం. ఒక్క నిమిషంలో కరోనా పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని కనిపెట్టారు. శ్వాస పరీక్షతో కరోనా ఉందా లేదా అన్నది తేల్చనున్నారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్ యుఎస్) ఈ విషయాన్ని మంగళవారం నాడు ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా ఆయా వ్యక్తుల శ్వాస ద్వారా శరీరంలోని ఆవయువాల ఒడిదుడుకులను గుర్తించి కరోనాను నిర్ధారిస్తుందని తెలిపారు. తాము నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో 90 శాతం పైగా ఫలితాలు నిక్కచ్చిగా వచ్చాయని తెలిపారు.

ఇప్పటివరకూ 180 మంది పేషంట్లపై ఈ మెషిన్ ను పరీక్షించి చూశారు. ఈ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది కానీ..ఎలాంటి లేబరేటరీ వ్యవస్థలు కానీ అవసరం లేదని తెలిపారు. డిస్పోజబుల్ మౌత్ పీస్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ యంత్రం ఎప్పటి నుంచి వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని విషయాన్ని తెలియచేయలేదు. ఈ మెషిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కరోనా పరీక్షల విషయంలో పెద్ద పురోగతి సాధించినట్లు అవుతుంది.


Next Story
Share it