Telugu Gateway
Telugugateway Exclusives

లోకేష్ ను 'బుల్డోజ్' చేస్తారనే అచ్చెన్నాయుడికి బ్రేకులు!

లోకేష్ ను బుల్డోజ్ చేస్తారనే అచ్చెన్నాయుడికి బ్రేకులు!
X

అపనమ్మకం. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఆ పదవి ఇచ్చినా ఆ ఆనందం ఉంటుందా?. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కోరుకున్న ఫలితం వస్తుందా?. నిర్ణయం తీసుకునేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. నిర్ణయాన్ని స్వయంగా లీకులు ఇచ్చి..అచ్చెన్నాయుడిలో ఆశలు కల్పించి ఇఫ్పుడు విపరీత జాప్యం చేయటం ద్వారా పార్టీలో కూడా అనవసర చర్చకు చంద్రబాబు కారణం అయ్యారు. ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పోలిస్తే అచ్చెన్నాయుడిది దూకుడు స్వభావం. అచ్చెన్నాయుడు అధ్యక్షుడు అయితే పరిస్థితిలో ఖచ్చితంగా ఎంతో కొంత తేడా ఉంటుంది. అయితే నియంత్రణలు (కంట్రోల్స్) అన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలోనే ఉన్నా అచ్చెన్నాయుడిని డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. సామాజిక వర్గపరంగా, ప్రాంతపరంగా చూస్తే అచ్చెన్నాయుడు ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతున్నారు. ఇఫ్పటికే ఒకప్పుడు టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీలు రకరకాల కారణాలతో ఆ పార్టీకి దూరం అయ్యారు. అలాంటి తరుణంలో అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చి..మధ్యలో తేడాలు చేస్తే అది కాస్తా మరింత డ్యామేజ్ చేస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

అచ్చెన్నాయుడికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ను 'బుల్డోజ్' చేస్తారనే అభిప్రాయం ఉంది. అందుకే లోకేష్ అడ్డుపుల్లలు వేస్తున్నారిని.. ఈ కారణంగానే నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రను ఓ సీరియస్ పోటీదారుగా సీన్ క్రియేట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పోస్టుకు బీదా రవిచంద్ర పోటీపడటంతో ఆయనకు ప్రధాన కార్యదర్శికి ఒప్పించినట్లు కలరింగ్ ఇచ్చే వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా పదవి ఇవ్వకముందే అచ్చెన్నాయుడి ముందరికాళ్లకు బంధం వేస్తున్నారనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాల్లో కలిగిస్తున్నాయి.

నారా లోకేష్ ఎంత ప్రయత్నించినా పార్టీలో కొంత మంది నేతలు ప్రస్తుతానికి ఆయన్ను ఆమోదించే పరిస్థితిలో లేరు. ఇది అటు చంద్రబాబుకు, ఇటు నారా లోకేష్ కు పెద్ద సమస్యగా మారింది. ఈ తరుణంలో అచ్చెన్నాయుడి ముందు నారా లోకేష్ మరింత వెలవెలబోతారన్నది కొంత మంది వాదన. అయితే కళా వెంకట్రావుతో పోలిస్తే అచ్చెన్నాయుడు మాత్రం తనదైన ముద్ర వేయటానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తారన్నది పక్కా. ఇదే ఇప్పుడు వారి భయం. అయితే ఎప్పుడో వెలువడాల్సిన ఏపీ అధ్యక్ష ప్రకటనలో ఇంత కాలం జాప్యం జరగటంతో పార్టీలో ఎంత అపనమ్మకం రాజ్యమేలుతుందో అర్ధం అవుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొత్తగా దసరాకు అధ్యక్ష పదవిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it