Telugu Gateway
Telugugateway Exclusives

ఏపీ ఐఅండ్ పీఆర్ శాఖ 'విచిత్రం'

ఏపీ ఐఅండ్ పీఆర్ శాఖ విచిత్రం
X

ఏపీ యాడ్స్ లో తెలంగాణ పంచాయతీ భవన ఫోటోలు

సోషల్ మీడియాలో నెటిజన్ల చెడుగుడు

ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మరో ఘనత సాధించింది. ఏపీ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలకు సంబంధించి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు పత్రికల్లో. సహజంగా ఏకగ్రీవాలకు సంబంధించి యాడ్స్ ఇచ్చినా కూడా ఇలా ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన చరిత్ర గతంలో ఎన్నడూలేదు. సరే ఈ యాడ్స్ అంశాన్ని కాసేపు పక్కనపెడితే ఏపీ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే ఎంత మొత్తంలో ప్రోత్సహకాలు ఇవ్వబోతుందీ అందులో పేర్కొన్నారు. అయితే ఆ యాడ్ లో ఉపయోగించిన ఫోటో మాత్రం తెలంగాణ పంచాతీయ కార్యాలయానిది కావటం విశేషం. ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖకు ఈ యాడ్ తయారు చేయటానికి ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఒక్క పంచాయతీ కార్యాలయం ఫోటో దొరకలేదా? లేక ఎవరు చూస్తారులే అని చేతికి ఏది దొరికితే అది వాడేశారా?. ఏపీ పత్రికల్లో వచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ లోని పంచాయతీ కార్యాలయం భవనం ఫోటోలో తెలంగాణ కు చెందిన 'కాకతీయ తోరణం' స్పష్టంగా కన్పిస్తోంది.

కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ అందులో ఏపీ పంచాయతీ భవనం కాకుండా.. తెలంగాణ పంచాయతీ భవనం..అది కూడా రాష్ట్ర లోగో సహా ప్రకటనలు ఇఛ్చారంటే ఆ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. ఈ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'కోట్లు గుమ్మరించి యాడ్స్ ఇస్తున్నారు ప్రభుత్వం వారు. అధికారిక వేలం పాటలో పాల్గొనాలని చెబుతున్నట్లు ఉంది వ్యవహారం చూస్తుంటే. మీ ప్రోత్సాహకాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరికీ తెలియదు. ఇన్ని రూపాయలు పెట్టి యాడ్స్ ఇస్తున్నారు కనీసం అక్కడ తెలంగాణ బొమ్మ కాకుండా ఆంధ్రప్రదేశ్ బొమ్మ పెట్టండి మహా ప్రభో ' అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

Next Story
Share it