Telugu Gateway
Telugugateway Exclusives

కారు విమానంగా మారుతుంది..ఎలాగో చూడండి

కారు విమానంగా మారుతుంది..ఎలాగో చూడండి
X

చాలా మందికి అలా గాల్లో ఎగిరిపోవాలనే కోరిక ఉంటుంది. గాల్లో ఎగరటం అంటే విమానాల్లోనే..హెలికాఫ్టర్ లోనే ప్రయాణించటం కాదు. గాల్లో ఎగురుతూ కూడా బయట ప్రపంచాన్ని హాయిగా చూసేలా వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. చూడబోతుంటే భవిష్యత్ లో ఇది నిజం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అది రెండు సీట్లు ఉండే ఓ కారులో విమానంలా ఎగిరిపోతే..నిజంగా గాల్లోకి ఎగరటం అనే నిజమైన ఫీలింగ్ ఇది కలగచేయవచ్చు. ఆ కోరిక త్వరలోనే తీరే అవకాశం కన్పిస్తోంది. దీని కోసమే 'ఎయిర్ కార్' వస్తోంది. మూడు నిమిషాలు. మూడంటే మూడు నిమిషాల్లో ఆ కారు విమానంగా మారిపోతుంది. అలాంటి ఎయిర్ కార్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ కారులో బీఎండబ్ల్యూకు చెందిన 1.6 లీటర్ ఇంజన్ ను ఉపయోగించారు.

కారును స్టార్ట్ చేసి 1500 అడుగులు పరిగెత్తాక విమానంగా రూపాంతరం చెందుతుంది. స్లోవేకియాకు చెందిన క్లెన్ విజన్ కంపెనీ ప్రయోగాత్మకంగా ఈ ఎయిర్ కారును పరీక్ష్చించి చూసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా కంపెనీ విడుదల చేసింది. రెండు సీట్ల మోడల్ తో కూడిన ఈ ఎయిర్ కారు బరువు 1100 కేజీలు. మరో 200 కిలోల అదనపు బరువును కూడా ఇందులో తీసుకెళ్ళవచ్చు. ఈ కారు సొంతంగా కారు నడిపుకుంటూ ప్రయాణాలు చేసేవారికి, వాణిజ్య ట్యాక్సీ సర్వీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ ఎయిర్ కారు ప్రయాణ రేంజ్ 1000 కిలోమీటర్లుగా తేల్చారు.

Next Story
Share it