దుబ్బాక ఓట్లు ఫామ్ హౌస్ లో లెక్కిస్తారా?
దుబ్బాక ఉప ఎన్నికల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఉప ఎన్నిక కోసం మంత్రి హరీష్ రావు ఎందుకింత హైరానా పడుతున్నారో అర్ధం కావటంలేదని అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బిజెపికి డిపాజిట్లు కూడా రావంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కౌంటింగ్ ఫామ్ హౌస్ లో చేస్తారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బిజెపిలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కెసిఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని ఆరోపించారు.