నాగ చైత్యన పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు
జ్యోతిష్యం కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆయన ఎక్కువ పాపులర్. ఆయనే వేణు స్వామి. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య రెండవ పెళ్ళికి సంబంధించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కొంత మంది ఇదే అంశంపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశారు. కమిషన్ నోటీసు లను ధిక్కరించిన ఆయన హై కోర్ట్ ను ఆశ్రయించగా ఆయనకు అక్కడ కూడా ఊరట లభించలేదు. అదే సమయంలో కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అని కోర్ట్ స్పష్టం చేసింది.
ఈ తరుణంలో వేణు స్వామి మంగళవారం నాడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు అయ్యారు. అదే సమయంలో తెలంగాణ మహిళా కమిషన్ కు క్షమాపణ చెప్పటంతో పాటు నాగచైతన్య పై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. అలా నాగచైతన్య, శోభిత దూళిపాళ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు బయటకు రాగానే...వీళ్ళు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణు స్వామి జోష్యం చెప్పటం పెద్ద కలకలం రేపింది. మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని వేణు స్వామిని మహిళా కమిషన్ హెచ్చరించింది.