టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 25న
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వెల్లడించారు. ఆయన బుధవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించారు. కరోనా కారణంగా ఎన్నిక కొద్దిగా ఆలశ్యం అయిందన్నారు. అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 17 న మొదలవుతుందని తెలిపారు. 22దాకా నామినేషన్ల ప్రక్రియ, .23 న స్కూటినీ ఉంటుంది. 24 న ఉపసంహరణ, 25 న ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. అదే రోజు పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.
ఆ వెంటనే హైటెక్స్ లో ప్లీనరీ జరుగుతుందని కెటీఆర్ వెల్లడించారు. 17 న టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ, ఎంపీ ల సమావేశం తెలంగాణభవన్ లోజరుగుతుందన్నారు. రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారని, పర్యవేక్షణ అధికారిగా పి. కృష్ణమూర్తి వ్యవహరిస్తారని తెలిపారు. అక్టోబర్ 27 న ద్విదశాబ్ది సభ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నారు. నవంబర్ 15 న వరంగల్ లో పార్టీ విజయ గర్జన సభ వరంగల్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు.