Telugu Gateway
Telangana

దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షుడి మార్పు

దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షుడి మార్పు
X

తెలంగాణ పీసీసీ మార్పుపై మాజీ ఎంపీ మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఫలితాల తర్వాత మార్పు ఉండొచ్చన్నారు. గత ఐదేళ్లుగా పీసీసీ అధ్య అధ్యక్షుడిగా ఒక్కరే ఉన్నారని..వరస ఓటములతో పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన నైరాశ్యం ఉందని అన్నారు. మధుయాష్కీ శుక్రవారం నాడు నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం ఉందన్నారు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహాంతో ముందుకు వెళ్తుందని అధిష్టానం ఆ దిశలో ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందన్నారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు.

పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారని తెలిపారు. ఆ తరువాత అధిష్టానం పీసీసీ మార్పు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. గత కొంతకాలంగా ఉత్తమ్‌ను బాధ్యత నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ మార్పు దుబ్బాక పలితాల తర్వాత కాదు..జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉంటుందని మరి కొంత మంది నేతలు చెబుతున్నారు.

Next Story
Share it