Telugu Gateway
Telangana

బడ్జెట్ మధ్యంతర సమీక్షకు కెసీఆర్ ఆదేశం

బడ్జెట్ మధ్యంతర సమీక్షకు కెసీఆర్ ఆదేశం
X

ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు పెద్ద ఎత్తున మారే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం సర్కారు బడ్జెట్ పై మధ్యంతర సమీక్షకు నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ''కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడింది. కేంద్ర జిడిపి కూడా మైనస్ 24 శాతానికి పడిపోయింది.

దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంతో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలి. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలి. మొత్తం బడ్జెట్ పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానిక నివేదిక ఇవ్వాలి'' అని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో పలు శాఖలకు బడ్జెట్ లో చేసిన కేటాయింపుల్లో కోతలు అనివార్యం కానున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

Next Story
Share it