Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుకు గవర్నర్ షాక్!

తెలంగాణ సర్కారుకు గవర్నర్ షాక్!
X

వీసీల నియామకంపై ఘాటు లేఖ

తెలంగాణలోని యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఎన్నో ఖాళీలు ఉన్నా సర్కారు వాటి భర్తీపై ఏ మాత్రం దృష్టి సారించటం లేదు. దీంతో సర్కారు గవర్నర్ తమిళ్ సై షాకిచ్చారు. ఈ మేరకు ఆమె ఘాటు లేఖ రాశారు. అందులో రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో వీసీల నియామకం చేపట్టకపోవడంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆమె ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీసీల నియామకం కోసం 2019 జులై 3న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్లుగా వీసీల నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించి.. వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాలు.. బోధించే ఆచార్యులు లేక వెలవెలబోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయిరా సర్కారు నుంచి స్పందన శూన్యం అనే చెప్పాలి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.

Next Story
Share it