Telugu Gateway
Telangana

రెండు గంటలు బాణాసంచా కాల్చుకోండి

రెండు గంటలు బాణాసంచా కాల్చుకోండి
X

బాణాసంచా అమ్మకాలు, వాడకంపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నిషేదపు ఆదేశాలకు పాక్షిక సడలింపు. ఈ నిషేధంపై బాణసంచా వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనుమతులు ఇఛ్చి అప్పటికప్పుడు నిషేధం అంటే తాము తీవ్రంగా నష్టపోతామని సుప్రీంను ఆశ్రయిచాంరు. దీంతో ఎన్జీటీ ఆదేశాల మేరకు తెలంగాణలో బాణాసంచా అమ్మకాలతోపాటు టపాసులు కాల్చుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది.

రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు కొంత ఊరట లభించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే గాలిలో కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ రెండు గంటల అనుమతి ఇస్తారు. గాలిలో కాలుష్యం ఎక్కువ ఉన్న చోట మాత్రం నిషేధం అమల్లో ఉంటుంది.

Next Story
Share it