రామ్ గోపాల్ వర్మపై బిజెపి నేతల ఫిర్యాదు
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై బిజెపి నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ను కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని నేతలు తమ ఫిర్యాదు లో పేర్కొన్నారు. బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ లు ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు.
ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్దిగా ద్రౌపతి ముర్ము పేరును ప్రకటించిన తర్వాత వర్మ ట్విట్టర్ లో స్పందించారు. ద్రౌపతి రాష్ట్రపతి అయితే..మరి పాండవులు ఎవరు..మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కూడా వర్మ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై పోలీసు స్టేషన్ లో బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.