Telugu Gateway
Telangana

సుప్రీంలో రేవంత్ కు ఊరట

సుప్రీంలో రేవంత్ కు ఊరట
X

ఓటుకు నోటు కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ ఏసీబీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ సాక్ష్యుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నాలుగు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఏసీబీని కోరింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో రేవంత్ రెడ్డి తోపాటు సండ్ర వెంకటవీరయ్య తదితరులను ప్రధాన నిందితులుగా పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటానికి డీల్ కుదుర్చుకుని తొలి విడత 50 లక్షల రూపాయలు ఇస్తూ వీడియోతో సహా పట్టుబడిన విషయం తెలిసిందే.

Next Story
Share it