Telugu Gateway
Telangana

వర్ష బీభత్సంతో వాహనాల పరిస్థితి ఇదీ

వర్ష బీభత్సంతో వాహనాల పరిస్థితి ఇదీ
X

హైదరాబాద్ లో వర్ష బీభత్స ప్రభావం కొనసాగుతూనే ఉంది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల మళ్లీ పాత కథే పునరావృతం అయింది. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. రహదారులు చెరువులుగా మారాయి. మలక్ పేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా మోకాలు లోతుపైనే నీరు నిలిచిపోయింది. పాత బస్తీలోని పలు చోట్ల అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ ప్రజలు గతంలో ఎన్నడూలేనంతగా భయకంపితులు అయ్యారు. ఇప్పుడు వర్షం పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితి.

ఎందుకుంటే చాలా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇళ్లలోకి నీరు రావటం, ఆ ప్రాంతాలు జలదిగ్భందంలోకి వెళ్ళిపోవటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఇంకా రెండు, మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్తలు రావటంతో పలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పైన చిత్రంలో చూస్తున్న వాహనాలు శనివారం నాటి వర్షానికి పాతబస్తీ ప్రాంతంలో కొట్టుకొచ్చినవి.


Next Story
Share it