Telugu Gateway
Telangana

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రెండే టెండర్లు

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రెండే టెండర్లు
X

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయానికి కేవలం రెండు అంటే రెండు సంస్థలు మాత్రమే బిడ్స్ సమర్పించాయి. అందులో ఒకటి ఎల్ అండ్ టి కాగా, మరోకటి షాపూర్జీ పల్లోంజీ. సుమారు ఆరు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నూతన భవనం నిర్మించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. అసలు నిర్మాణం పూర్తయ్యేవరకూ ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడే చెప్పటం కష్టం. పన్నెండు నెలల్లోనే ఈ నిర్మాణం పూర్తి చేయాలని షరతు పెట్టడం వల్ల నిర్మాణ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదని కాంట్రాక్ట్ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం నాడు ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచి ఎవరికి ఈ పని దక్కనుందో ప్రకటించనున్నారు. ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థ ఒప్పందం ప్రకారం 12 నెలల్లోనే సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి దసరాకు నూతన భవన పనులకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండటంతో ఈ సమయంలో శంకుస్థాపన చేస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. తెలంగాణ సర్కారు నూతన సచివాలయ నిర్మాణానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పాత సచివాలయాన్ని కూల్చేసి నూతన భవన నిర్మాణానికి సిద్ధం చేశారు.

Next Story
Share it