Telugu Gateway
Telangana

కెపీహెచ్ బీ-హైటెక్ సిటీ మార్గంలో ఆర్ యూబీ ప్రారంభం

కెపీహెచ్ బీ-హైటెక్ సిటీ మార్గంలో ఆర్ యూబీ ప్రారంభం
X

నగరంలో ముఖ్యంగా ఐటి కారిడార్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని సోమవారం మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్‌ ఉన్న హైటెక్‌ సిటీ, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ మార్గంలో కష్టాలు తీరనున్నాయి.

జేఎన్‌టీయుహెచ్‌ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారేది. ఈ ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్‌లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు.

Next Story
Share it